APMJPAP BCRJC AP Mahatma Jyothi Bha Phule 5th Admissions Selection List
బిసి గురుకులాల్లో విద్యార్థులకు సీట్లు - 5,482 మంది ఎంపికమహాత్మా జ్యోతిరావు బాఫూలే బిసి గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతిలో చేరేందుకు విద్యార్థులకు ఆ సంస్థ సీట్లు కేటాయించింది. లాటరీ విధానంలో విద్యార్థుల సీట్ల కేటాయింపు మొదటి విడత ప్రక్రియ సోమవారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5వ తరగతి ప్రవేశానికి 31,952 దరఖాస్తులు వచ్చాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బిసి గురుకులాల్లో 5వ తరగతికి 5,620 సీట్లు ఉన్నాయి. వీటికి గాను 5,482 మంది విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులు జూన్ 10లోపు సంబంధిత గురుకులాల్లో తగిన ధ్రువపత్రాలతోపాటు సీటు పొందాలని అధికారులు సూచించారు. ఈ మేరకు బిసి గురుకులాల సంస్థ కార్యదర్శి ఎ కృష్ణమోహన్ సోమవారం ప్రకటన విడుదల చేశారు
0 comments:
Give Your valuable suggestions and comments