Edn Minister meeting with Unions - 17th May 2023 on Transfers Promotions Highlights

Edn Minister meeting with Unions - 17th May 2023 on Transfers Promotions Highlights

Edn Minister meeting with Unions - 17th May 2023 on Transfers Promotions Highlights


తాజా సమాచారం
A.P.UNITED TEACHERS' FEDERATION
ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్

E-mail : aputf1974@gmail.com,Web: www.aputf.org, Ph.No.0866-2973763 తేది: 17.05.2023

ఈ రోజు (17.05.2023) పాఠశాల విద్యాశాఖ మంత్రి వివిధ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ డైరక్టర్ కె.సురేష్ కుమార్, జాయింట్ డైరక్టర్ ఎం.రామలింగం పాల్గొన్నారు.

ప్రమోషన్లు :
ఇటీవల ప్రమోషన్ల పేరుతో వర్క్ అడ్జస్ట్మెంట్ చేసిన ఉపాధ్యాయులకు వారికి కౌన్సిలింగ్ నిర్వహించన తేదీ నుండి సర్వీస్ రూల్స్ ప్రకారం పే ఫిక్సేషన్ చేయాలని, వారికి శాశ్వత ప్లేస్ కేటాయించిన తర్వాతనే మిగిలిన ఖాళీలు భర్తీ చేయాలని, ఏ ప్రమోషన్లోనైనా ఎఫ్తార్ 22(బి) ప్రకారం పేఫిక్సేషన్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరాము. ప్లస్ టూ హైస్కూల్స్లో ఖాళీలు రెగ్యులర్ ప్రాతిపదికన ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేసాము. సంస్కృతం, ఫిజికల్ డైరక్టర్, లైబ్రేరియన్ పోస్టులు సృష్టించి ప్రమోషన్లు ఇవ్వాలని కోరాం. విల్లింగ్, అన్విల్లింగ్ పద్దతి కాకుండా ఖాళీలు చూపి ప్రత్యక్షంగా కోరుకునేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని, బదిలీల అనంతరమే ప్రమోషన్లు చేపట్టాలని కోరాము. గత తెలుగు, హిందీ ప్రమోషన్ల కౌన్సిలింగ్లో విల్లింగ్ ఇచ్చిన వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు వుంటే అనుమతించాలని కోరాము.

ప్రమోషన్ల అంశం ఇటీవల వరకు కోర్టు పరిధిలో ఉన్నందున వెనుకటి తేదీ నుండి ప్రమోషన్లు వర్తింపజేసేందుకు లీగల్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున మొత్తం ప్రమోషన్ల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా ప్రక్రియ చేపడతామని చెప్పారు.

మిగిలిన అంశాలకు సంబంధించి
(1) కొత్తగా మంజూరైన 679 ఎంఇఓ -2 పోస్టులను జిల్లా పరిషత్ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేయడానికి నిర్ణయించారు. అయితే ఉమ్మడి సర్వీస్ రూల్స్ వివాదం కోర్టులో ఉన్న కారణంగా ఖాళీగా ఉన్న 275 ఎంఇఓ-1 పోస్టులను మాత్రం ఇప్పుడు భర్తీ చేయరు.

గ్రేడ్-2 హెడ్మాస్టర్ల నుండి విల్లింగ్ ఇచ్చిన వారిని ముందుగా ఎంఇఓ పోస్టులలో సర్దుబాటు చేసి మిగిలిన ఖాళీలను స్కూల్ అసిస్టెంట్ల నుండి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు.

(2) 292 ప్లస్ టు హైస్కూల్సులో ఇంటర్మీడియట్ విద్య బోధించడానికి 1752మంది సిబ్బంది అవసరమని గుర్తించారు. అయితే వీరిలో ఇప్పుడు 1746 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారు. విల్లింగ్ ఇచ్చిన సీనియర్లకు ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇస్తూ రీ-డిప్లాయ్ మెంట్ పద్దతిని భర్తీ చేస్తారు. ఇవి ప్రమోషన్లు కావు. క్యాడర్ కూడ మారదు. స్కూల్ అసిస్టెంట్లోనే సబ్జెక్టు టీచర్లుగా పరిగణిస్తారు.

(3) ఎంఇఓలకు విల్లింగ్ ఇచ్చిన గెజిటెడ్ హెడ్మాస్టర్ల పోస్టులు, కొత్తగా అప్గ్రేడ్ అయిన మరియు ఖాళీగా వున్న 350 గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తారు. 

(4) 2022లో 70%, 30% పోస్టులలో ప్రమోషన్ కొరకు విల్లింగ్ ఇచ్చిన ఉపాధ్యాయుల జాబితా మొత్తం రద్దు అవుతుంది. తెలుగు, హిందీ ప్రమోషన్లకు విల్లింగ్ ఇచ్చిన ఉపాధ్యాయుల జాబితా కూడా రద్దు అవుతుంది. మరల క్రొత్తగా సీనియారిటీ లిస్టు రూపొందించి ప్రమోషన్లు ఇస్తారు. గతంలో రిలింక్విష్ చేసి ఒక సంవత్సరం పూర్తి అయిన వారందరినీ సీనియారిటీ జాబితాలో చేర్చుతారు.

2 గతంలో ఇచ్చిన 4624 ప్రమోషన్లతో బాటు ఇప్పుడు అదనంగా వచ్చేవాటిని కలుపుకుని మొత్తం 6269 స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోర్టులో వివాదం ఉన్న కారణంగా తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు మాత్రం ఇవ్వరు. గతంలో ఈ ప్రమోషన్లకు విల్లింగ్ ఇచ్చిన వారు వేరే సబ్జెక్టులలో ప్రమోషన్లకు ఆప్షన్ ఇవ్వదలిస్తే అవకాశం ఇస్తారు.

(5) ఒక క్యాడర్లో బదిలీలు జరిగిన తర్వాతనే ప్రమోషన్లు ఇస్తారు. అనగా ముందు ఎంఇఓ పోస్టులు భర్తీ చేస్తారు. తర్వాత హెచ్ఎం బదిలీలు జరుపుతారు. ఏర్పడిన ఖాళీలలో మ్యానువల్గా ప్రమోషన్లు కౌన్సిలింగ్ చేస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ బదిలీలు, ప్రమోషన్లు ఆ తర్వాత ఎసిటి తత్సమాన క్యాడర్ల బదిలీలు నిర్వహిస్తారు. ఈ విధంగా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.

బదిలీలు :

వేసవి సెలవులలోనే ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేసేందుకు ముసాయిదా ఉత్తర్వులు రూపొందించారు. దానినే ఉపాధ్యాయ సంఘాలతో చర్చకు పెట్టారు.

తప్పనిసరి బదిలీలకు ప్రధానోపాధ్యాయులకు గరిష్టంగా 5 పూర్తి సం॥లు, ఎసిటి, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేడర్లకు 8 అకడమిక్ సంవత్సరాలు గరిష్ట పరిమితిగా ఉంటుంది. 31.05.2015కు ముందు బదిలీ అయిన వారందరూ తప్పనిసరి బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి. 31.05.2025 నాటికి 2 సం||లలోపు సర్వీస్ కలిగిన వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. రేషనలైజేషన్కు గురైతే మాత్రం తప్పనిసరిగా బదిలీ కావలసి ఉంటుంది.

40% కంటే అధికంగా అంధత్వం కలిగిన వారికి, 75% అంగవైకల్యం కలిగిన ఉపాధ్యాయులకు బదిలీల నుండి మినహాయింపు ఇస్తారు.

స్పెషల్ పాయింట్లు :
అవివాహితలు, స్పౌజ్ కేటగిరీ, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 5 స్పెషల్ పాయింట్లు ఇస్తారు.

అంధత్వం, అంగవైకల్యం, వినికిడి లోపం కలిగిన ఉపాధ్యాయులకు 40% - 55% వైకల్యం ఉన్న వారికి 5 పాయింట్లు, 56% - 69% వైకల్యం కలిగిన వారికి 10 పాయింట్లు ఇస్తారు.

ఏ విధంగా రీఅపార్షన్మెంట్కు గురైనప్పటికీ ఉపాధ్యాయులకు 5 పాయింట్లు ఇస్తారు. అయితే 5/8 సం||ల సర్వీస్ పూర్తి చేసిన హెడ్మాష్టర్ / ఉపాధ్యాయులకు మరియు రీఅపార్షన్మెంట్కు విల్లింగ్ ఇచ్చిన సీనియర్ టీచర్లకు మాత్రం పాయింట్లు ఇవ్వరు.

ప్రిఫరెన్షియల్ కేటగిరీ :

(ఎ) 70% అంధత్వం, అంగవైకల్యం, వినికిడి లోపం కలిగిన ఉపాధ్యాయులు

(బి) మానసిక వికలాంగులైన తల్లి, తండ్రి, భార్య / భర్త, పిల్లలు కలిగిన ఉపాధ్యాయులు

(సి) క్యాన్సర్, ఓపెన్హార్ట్ సర్జరీ, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్, న్యూరోసర్జికల్ ఆపరేషన్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ / డయాలసిస్ వ్యాధులు కలిగి ఉన్న ఉద్యోగులు లేదా వారిపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రులు, స్పౌజ్, పిల్లలు.

(డి) భర్తను కోల్పోయిన మహిళలు

(ఇ) విడాకులు పొంది పునర్వివాహం చేసుకోని స్త్రీలు

(ఎఫ్) గుండెలో రంధ్రం ఏర్పడడం వల్ల చికిత్స పొందుతున్న పిల్లలు కలిగిన ఉపాధ్యాయులు

(జి) జువనైల్ డయబెటిస్ తో బాధపడుతున్న పిల్లలు కలిగిన ఉపాధ్యాయులు

(హెచ్) తలసేమియా వ్యాధికి గురైన పిల్లలు కలిగిన ఉపాధ్యాయులు

(ఐ) హిమోఫిలియా వ్యాధికి గురైన పిల్లలు కలిగిన ఉపాధ్యాయులు

(జె) మస్కులర్ డిస్ట్రోఫి వ్యాధికి గురైన పిల్లలు కలిగిన ఉపాధ్యాయులు

(కె) ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ఎలో పనిచేస్తున్న వారి స్పౌజ్

ఎల్) ఆర్మీ, నావీ, ఎయిర్ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ఎలో గతంలో పనిచేసి ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు

- పై ఎ,బి,సి కేటగిరీలలో దరఖాస్తుకునే వారు గడిచిన 6 నెలలలోపు పొందిన వైద్య ధృవ పత్రాన్ని దరఖాస్తుతో జతపరచాలి. పిహెచ్ కోటాలో రిక్రూట్ అయినవారు వారి సర్వీస్ రిజిష్టర్లలో నమోదు అయితే వుంటే ఎటువంటి సర్టిఫికెట్ జతపరచనవసరం లేదు.

బదిలీలకు దరఖాస్తు చేసుకునే వారు స్పెషల్ పాయింట్లుగాని, ప్రిఫరెన్షియల్ కేటగిరీ గాని ఎదో ఒకటి మాత్రమే గత 5/8 సం||లకు ముందు వినియోగించుకుని ఉండాలి.

రీఅపార్షన్మెంట్కు గురైన ఉపాధ్యాయులు ప్రిఫరెన్షియల్ కేటగిరీ లేదా స్పౌజ్ కేటగిరీ ఇంతకుముందు బదిలీలలో వినియోగించుకున్నప్పటికీ ప్రస్తుత బదిలీలలో మరల వినియోగించుకోవచ్చు. వీరికి రీఅపార్షన్మెంట్ పాయింట్లతో పాటు ఓల్డ్ స్టేషన్ పాయింట్లు కూడా వర్తిస్తాయి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల స్టేషన్ పాయింట్లు మాత్రం ఇవ్వబడవు.


ఇతర అంశాలు
31.05.2023 నాటికి గల క్లియర్ వేకెన్సీలు, తప్పనిసరి బదిలీల వల్ల ఏర్పడిన ఖాళీలు ప్రమోషన్ల వల్ల ఉత్పన్నమైన ఖాళీలు మొత్తం అన్ని చూపుతారు. అయితే తదుపరి డిఎస్సి కోసం వుంచిన ఖాళీలను అన్ని మండలాలలో సమానంగా ఉండేలా బ్లాక్ చేస్తారు.

సింగిల్ టీచర్స్ స్కూల్స్ రెగ్యులర్ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉంటారు. రెండు పోస్టులు వుంటే ఒక పోస్టులో రెగ్యులర్ ఉపాధ్యాయుడు, 2వ పోస్టులో మినిమమ్ టైంస్కేల్ ఉపాధ్యాయుడు ఉండేలా చూస్తారు. - జిల్లాల వారీగా, కేటగిరీవారీగా బదిలీల ఉత్తర్వులను జారీ చేస్తారు. ఎవరైనా కోర్టుకు వెళితే మొత్తం ప్రక్రియ ఆగిపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పై అంశాలలో కొద్దిపాటి మార్పులు, చేర్పులతో 1,2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయి.
ఉద్యమాభినందనలతో