APOSS AP Open School 10th, Inter Public Exams 2025-26 Fee Payment Dates [ Released]

APOSS AP Open School 10th, Inter Public Exams 2025-26 Fee Payment Dates [ Released]. AP Open School Society has released the APOSS 10th and Inter Public Exams 2026 Fee Payment Dates.

All the students who are enrolled in AP Open School for Academic Year 2025-26 have to pay fee in the prescribed dates mentioned below.

APOSS AP Open School 10th, Inter Public Exams 2025-26 Fee Payment Dates [ Released]

APOSS AP Open School 10th, Inter Public Exams 2025-26 Fee Payment Dates [ Released]

APOSS AP Open School 10th, Inter Public Exams 2025-26 Fee Payment Dates [ Released]. AP Open School Society has released the APOSS 10th and Inter Public Exams 2026 Fee Payment Dates.

All the students who are enrolled in AP Open School for Academic Year 2025-26 have to pay fee in the prescribed dates mentioned below.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, అమరావతి
పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చ్, 2026 పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీల వివరములు

APOSS 10th, Inter March 2026 Fee Payment Schedule Rc.No.APOSS-14022(52)/307/2025-EXAM/INTER-APOSS, dt.24-11-2025

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి వారిచే నిర్వహించబడు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి-2026 హాజరగుటకు గాను, పరీక్ష ఫీజా ది. 01.12.2025 నుండి 15.12.2025 వరకు, అభ్యాసకులు ఏదేని APONLINE సేవా కేంద్రము లేదా ONLINE PAYMENT GATEWAY ద్వారా గాని నేరుగా చెల్లించ వచ్చును.
  • అపరాధ రుసుము లేకుండా ది. 01.12.2025 నుండి 10.12.2025 వరకును;
  • అపరాధ రుసుము రూ.25/- తో ది. 11.12.2025 నుండి 12.12.2025 వరకును;
  • అపరాధ రుసుము రూ.50/- తో ది. 13.12.2025 నుండి 15.12.2025 వరకును,

APOSS 10th, Inter Public Exams 2026 Fee Payment Dates

అంశములు
ఎ.పి టి.ఆన్ లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించు తేదీలు
ఎ.ఐ సమన్వయ కర్తలు, డి. ఇ. ఓ కు యన్.ఆర్ లు సమర్పించు తేది
డి.ఇ.ఓ లు రాష్ట్ర కార్యాలయమునకు యన్.ఆర్ లు సమర్పించు తేది
నుండి
వరకు
అపరాధ రుసుము లేకుండా
01.12.2025
10.12.2025
16.12.2025
17.12.2025
ఒక సబ్జెక్టును రూ.25/- అపరాధ రుసుముతో
11.12.2025
12.12.2025

ఒక సబ్జెక్టునకు రూ.50/- అపరాధ రుసుముతో

13.12.2025
15.12.2025

APOSS 10th Inter Public Exams Fee Details


Details Registration Fee Exam Fee Total Fee
General
పదవ తరగతి - థియరి ఒక సబ్జెక్టు కు రూ 5/- రూ 95/- రూ 100/-
ఇంటర్మీడియట్ థియరి ఒక సబ్జెక్టు కు రూ 5/- రూ 145 రూ 150
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఒక సబ్జెక్టు కు రూ 5/- రూ 95/- రూ 100/-
ఉత్తీర్ణులు కానీ ఇంటర్మీడియట్ అభ్యాసకులు, ఉత్తీర్ణత పొందిన సబ్జెక్టు ఒక్కయింటికి బెటర్మెంట్ కొరకు
ఇంటర్మీడియట్ థియరి ఒక సబ్జెక్టు కు రూ 5/- రూ 245 రూ 250
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఒక సబ్జెక్టు కు రూ 5/- రూ 95/- రూ 100/-
ఇంప్రూవ్మెంట్ ఇంతకు ముందు అన్ని సబ్జెక్టు ల నందు పాస్ అయిన అభ్యాసకులు
పదవ తరగతి - థియరి ఒక సబ్జెక్టు కు రూ 5/- రూ 195/- రూ 200/-
ఇంటర్మీడియట్ థియరి ఒక సబ్జెక్టు కు రూ 5/- రూ 295 రూ 300
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఒక సబ్జెక్టు కు రూ 5/- రూ 95/- రూ 100/-
ఇంటర్మీడియట్ తత్కాల్ రుసుము     రూ 1000
పదవతరగతి తత్కాల్ రుసుము     రూ 500

1. పరీక్ష ఫీజు కట్టుటకు అర్హతలు

(అ) 2025-26 విద్యా సంవత్సరం నందు ప్రవేశము పొంది, 08.2025.31 నాటికి యస్. యస్. సి. అభ్యర్థులు 14 సం||, ఇంటర్మీడియట్అభ్యర్ధులు 15 సం|| వయస్సు నిండినవారు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించుటకు అర్హులు.

(ఆ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది పరీక్షకు హాజరై తప్పిన అభ్యర్ధులు.

(ఇ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది ఇంతవరకును పరీక్షకు హాజరు కాని అభ్యర్ధులు

2. పరీక్ష రుసుమును ఎ.పి.టి. ఆన్ లైన్ ద్వారా చెల్లించవచ్చును. డి.డి/ చలానా రూపములో స్వీకరించబడదు. మరియు, APOSS website: www.apopenschool.ap.gov.in పొందు పరచబడిన, 'పేమెంట్ గేట్వే' ద్వారా, కూడా పరీక్ష రుసుమును, నెట్ బ్యాంకింగ్, డెబిట్ /క్రెడిట్ కార్డులతో, సెలవు దినములతో సహా ఎల్లవేళలా (24/7), చెల్లించవచ్చును.

3. ఎ.పి. టి. ఆన్ లైన్ /'పేమెంట్ గేట్వే' ద్వారా చెల్లించిన పరీక్ష రుసుము రసీదును భద్రపర్చుకొనవలెను. ఫీజు చెల్లించిన రసీదు నందు మీ సబ్జెక్టులను సరి చూసుకొనవలెను. సరియైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించనిచో, మరొకసారి ఫీజు చెల్లించవలసివచ్చును. ఒకసారి చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.

4. దివ్యాంగులు పరీక్ష ఫీజు నుండి మినహాయించబడినారు. ఐనను వారు పరీక్షలకు హాజరుకాగోరు సబ్జెక్టులను ఎంపిక చేసుకొని, ఎ.పి.టి.ఆన్ లైన్/ 'పేమెంట్ గేట్వే', నందు రిజిస్ట్రేషన్ మరియు ఎ.పి.టి. ఆన్ లైన్ వారి సేవా రుసుము చెల్లించి, తగిన రసీదు పొందగలరు. రసీదు నందు ఎంపిక చేసుకొన్న సబ్జెక్ట్ వివరములు సరిచూసుకొనగలరు.

5. ఒక సబ్జెక్టునకు కట్టిన రుసుము మరొక సబ్జెక్టు నకు బదలాయించబడదు మరియు సంబంధం లేని సబ్జెక్టులకు ఫీజు చెల్లించి హాజరు అయినచో ముందస్తు నోటీసు లేకుండా అట్టి పరీక్షలు రద్దు చేయబడును.

6. ఫీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు. పరీక్షారుసుము చెల్లించకుండా ఏదేని సబ్జెక్ట్/ సబ్జెక్టులకు హాజరైన అట్టి పరీక్షలను ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును.

7. కనీస వయస్సు లేని వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరైనచో వారి ప్రవేశము మరియు పరీక్షలు రద్దు చేయబడును.

8. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి నియమావళికి భిన్నముగా అభ్యాసకుడు రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో అనుచిత ప్రవేశము పొంది మరియు రెండు అధ్యయన కేంద్రములలో పరీక్ష రుసుము చెల్లించినఎడల, అట్లు అనుచితముగా రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును . మరియు చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.