Compassionate Appointment Rules in Telugu = Compassionate Appointments Procedural Instructions-The Rules of Compassionate Appointments in detailed explained in Telugu for better understanding. All Doubts about compassionate appointments will get cleared here.
కారుణ్య నియమకాలు -విధివిధానాలు ముఖ్యాంశాలు- కారుణ్య నియమకాలు - విభిన్న అంశములపై ప్రభుత్వము జారీ చేసిన ఉత్తర్వులు
విధివిధానాలు- ముఖ్యాంశాలు- తక్షణ విశిదము కొరకు. కారుణ్య నియమకాలపై ప్రభుత్వము జారీ చేసిన పలు ఉత్తర్వులు. కారుణ్య నియమకాలపై ప్రభుత్వము జారీ చేసిన పలు ఉత్తర్వులు.
ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగానే అకాల మరణం చెందిన తరువాత అప్పటివరకూ అతని / ఆమె సంపాదన పై ఆధారపడి జీవిస్తున్న అతని / ఆమె కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత సూత్రాలకు అనుగుణముగా, కుటుంబ పోషణ నిమిత్తము, అర్హత గల కుటుంబ సభ్యులలో ఒకరికి, నియమ నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశం కల్పించడము ఈ కారుణ్య నియామకాల వెనుక వున్న ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యము. ఈ కారుణ్య నియామకము పధకము మొదటగా G.O.Ms.No. 1005, Employment & Social Welfare Department, dated: 27.12.1974 ద్వారా ప్రవేశపెట్టడము జరిగినది. సాంఘిక సంక్షేమ ప్రక్రియ క్రింద కారుణ్య నియామక పథకం ప్రప్రథమంగా G.O.Ms.No. 1005 Employment and Social Welfare (G) Department dated 27-12-1974 ద్వారా నియమ నిబంధనలు రూపొందించి ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. అంతవరకు మరణించిన కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా తక్షణ శాశ్వత పరిష్కారం కల్పించాలనే సదుద్దేశంతో వారిలో ఒకరికి ఉద్యోగం కారుణ్య రీత్యా కల్పించి ఆదుకోవాలని, ఇంతకు ముందే జారీ చేసిన ఉత్తరువులు రద్దు చేస్తూ, మరికొన్ని సౌలభ్యాలతో G.O.Ms.No. 687 G.A. (Ser.A) Dept., dated 31-10-1977 ద్వారా ఉత్తరువులు జారీ చేశారు.
ఆలస్యాన్ని నివారించుటకు జిల్లా కలెక్టర్ (నోడల్ అధికారి) వారికి కారుణ్య నియమకము కొరకు ప్రతిపాదనలు పంపేటప్పుడు ఈ క్రింది పేర్కొన్న సూచనల / ప్రభుత్వ ఉత్తర్వులను విధిగా పరిశీలించి నోడల్ అథారిటీ అయిన జిల్లా కలెక్టర్ వారికి కారుణ్య నియామకం కొరకు ప్రతిపాదనలు పంపవలెను.
కారుణ్య నియమకాలు -విధివిధానాలు ముఖ్యాంశాలు- కారుణ్య నియమకాలు - విభిన్న అంశములపై ప్రభుత్వము జారీ చేసిన ఉత్తర్వులు
విధివిధానాలు- ముఖ్యాంశాలు- తక్షణ విశిదము కొరకు. కారుణ్య నియమకాలపై ప్రభుత్వము జారీ చేసిన పలు ఉత్తర్వులు. కారుణ్య నియమకాలపై ప్రభుత్వము జారీ చేసిన పలు ఉత్తర్వులు.
Compassionate Appointment Rules in Telugu - కారుణ్య నియమకాలు -విధివిధానాలు ముఖ్యాంశాలు
What is Compassionate Appointment in Telugu - Introduction:ఆలస్యాన్ని నివారించుటకు జిల్లా కలెక్టర్ (నోడల్ అధికారి) వారికి కారుణ్య నియమకము కొరకు ప్రతిపాదనలు పంపేటప్పుడు ఈ క్రింది పేర్కొన్న సూచనల / ప్రభుత్వ ఉత్తర్వులను విధిగా పరిశీలించి నోడల్ అథారిటీ అయిన జిల్లా కలెక్టర్ వారికి కారుణ్య నియామకం కొరకు ప్రతిపాదనలు పంపవలెను.
తదుపరి వివిధ ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా నియమ నిబంధనలు ఈ క్రింది విధముగా ఉన్నవి:
ఒక్కో సెక్షన్ మీద క్లిక్ చేసి కావలసిన సమాచారం పొందవచ్చును.
- కారుణ్య నియమకము కోసము దరఖాస్తును ఉద్యోగి ఏ కార్యాలయములో అయితే పనిచేస్తూ మరణించారో అట్టి కార్యాలయపు అధికారికి సమర్పించాలి.
- ఉద్యోగి చనిపోయిన తేదీ నుండి ఒక సంవత్సరము లోపల ఉద్యోగము కోసము దరఖాస్తు చేసుకొనవలసి ఉన్నది.
- చనిపోయిన ఉద్యోగి కుటుంబములో ఇతరత్రా సంపాదనాపరులు లేనప్పుడు భార్య / భర్త (spouse) పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు వారి అర్హతల మేరకు ఉద్యోగము పొందుటకు అర్హులు.
ఒక్కో సెక్షన్ మీద క్లిక్ చేసి కావలసిన సమాచారం పొందవచ్చును.
|
Click Here |
|
Click Here |
|
Click Here |
|
Click Here |
|
Click Here |
|
Click Here |
|
Click Here |
|
Click Here |
|
Click Here |
విద్యార్హతలు
- కారుణ్య నియామకములో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగము కొరకు కనీస విద్యార్హతలుగా డిగ్రీ విద్యార్హత మరియు కంప్యూటర్ నిర్వహణ పరిజ్ఞానము కలిగి ఉండాలి (G.O. Ms. No. 135 GA (Ser.B) department, తేదీ. 12.05.2014).
- దరిమిలా పై ఉత్తర్వులను సవరిస్తూ , కారుణ్య నియామకములో డిగ్రీ అర్హత లేకున్నా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నా, సదరు వ్యక్తి 5 సంవత్సరముల లోపల డిగ్రీ అర్హత మరియు 2 సంవత్సరముల లోపల కంప్యూటర్ నిర్వహణ పరిజ్ఞా నము పరీక్ష (Proficiency Test) యందు ఉత్తీర్ణత కావలసి ఉన్నట్లుగా షరతులతో కూడిన నియామకము ఇవ్వవచ్చును (G.O. Ms. No. 112 GA (Ser.A) department, తేదీ. 18.08.2017).
- ఆఫీసు సుబార్డినేట్ మరియు దిగువ స్థాయి ఉద్యోగముల కొరకు Last Grade service rules, 1992 నియమ నిబంధనల ప్రకారము ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేయవలసి ఉంటుంది.
కారుణ్య నియామక పద్దతులు - ముఖ్య సూచనలు.
కారుణ్య నియామకముల విషయములో పైన పేర్కొన్నవి విధివిదానాలు మాత్రమే అంతిమమైనవి గా భావించరాదు. సంబంధిత అధికారులు కారుణ్య నియామక పధకములో ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేయునప్పుడు సందర్భానుసారముగా ప్రభుత్వము మరియు సంబంధిత శాఖ వివిధ రూపములో జారీ చేయు ఉత్తర్వులను, నియమ నిబంధనలను విధిగా / నిశితముగా పరిశీలించి తదుపరి ఉత్తర్వులు జారీచేయవలసి ఉంటుంది.
Download Complete Details of Compassionate Appointments Click Here
- మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆధారపడిన అర్హత కల అభ్యర్ధి " స్థానిక అభ్యర్థి "అయిన" స్థానిక కేడర్ "లో మాత్రమే కారుణ్య ప్రాతిపదికన నియామకము చేయాలి (ప్రభుత్వ మెమో నెం. 17414/Ser.A/2007, తేదీ: 07-12-2007).
- ఉద్యోగములో ఉంటూ లేదా సెలవులో ఉంటూ ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడినవారికి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాన్ని చేపట్టవచ్చును (సర్క్యులర్ మెమో
- నెం. 41758/Ser.G/2006-2, Dated: 19-07-2007).
- కారుణ్య నియామక పద్ధతిలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 నియమనిబంధనలలోని రూల్ 22 ప్రకారం రిజర్వేషన్ల నియమం పాటించాలి (ప్రభుత్వ మెమో నెం. 60681/Ser.A/2003-1 తేదీ: 12-8-2003)
- కారుణ్య నియామకములు, చనిపోయిన ఉద్యోగి పనిచేసిన శాఖలో మాత్రమే ఖాళీగా ఉన్న పోస్టులో నియమ నిబంధనల మేరకు నియమించాలి (ప్రభుత్వ మెమో నెం. 60681/Ser.A/2003-1 తేదీ: 12 8-2003).
- ఉద్యోగి సర్వీస్ లో ఉంటూ చనిపోయిన సందర్భాలలో, సదరు కార్యాలయములో గాని, జిల్లా యూనిట్ లో గాని ఖాళీలు ఉన్న సందర్భాలలో సంబంధిత అధికారి, అర్హత గల కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకము నియమ నిబంధనల మేరకు కల్పించాలి. ఒకవేళ కార్యాలయములో పోస్టులు ఖాళీలు విషయము, ఇంతకుముందే జిల్లా కలెక్టర్ (నోడల్ అధికారికి) నివేదించిన తరువాత అర్హతలు గల అభ్యర్ది నుండి దరఖాస్తు వచ్చినట్లయితే, వాస్తవ విషయాలను కలెక్టర్ (నోడల్ అధికారికి) తెలియజేసి, వారి అనుమతి పొందిన తరువాత మాత్రమే ఉత్తర్వులు జారీ చెయ్యాలి. అలాంటి సందర్భాలలో జిల్లా కలెక్టర్ వారి ముందస్తు అనుమతి లేకుండా నియమకాలు చేయరాదు (G.O.Ms.No.215,GA (Ser.A) Department, తేదీ :08.04.1993)
- ఉద్యోగి పనిచేసిన శాఖలో అభ్యర్ది అర్హతకు తగ్గ ఉద్యోగము Rule of Reservation ప్రాతిపదికన ఖాళీలు లేనప్పుడు మాత్రమే, అటువంటి కేసులను నోడల్ అథారిటీ అయిన జిల్లా కలెకకు కారుణ్య నియామకం చేయడానికి పైన పేర్కొన్న సూచనల ప్రకారము వాస్తవ విషయములు తెలియజేస్తూ ఖాళీగా ఉన్న పోస్టుల పర్షితిని తెలియజేస్తూ తిపాదనలు పంపాలి (G.O.Ms.No.427, GA (Ser.A) Department, తేదీ :1.7.1991 మరియు ప్రభుత్వ మెమో నెం. 60681/Ser.A/2003-1 తేదీ: 12-8-2003).
- సర్వీస్ లో ఉంటూ ఉద్యోగి చనిపోయిన సందర్భాలలో, అతని / ఆమె, భార్య / భర్త సర్వీస్ పెన్షన్ పొందుతున్న సందర్భాలలో కారుణ్య నియామకము కల్పించకూడదు. అనగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటున్న, పదవీ విరమణ చేసిన తల్లిదండ్రు లలో ఎవరైనా సర్వీస్ పెన్షన్ పొందుతున్న సందర్భాలలో, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబసభ్యులెవరూ కారుణ్య నియమకములకు అర్హులు కారు (ప్రభుత్వ మెమో నెం. 3548/Ser.G/A2/2010-8, GA (Ser.G) department, తేదీ: 24.03.2012).
- కారుణ్య నియమకాలు, కేవలము సర్వీస్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తు న్న కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. కావున చనిపోయిన పింఛనుదారుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పధకము వర్తించదు (ప్రభుత్వ మెమో నెం. 618/Ser.A/79-11, తేదీ. 17.12.1979).
- కారుణ్య నియమకములలో రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయకూడదు (ప్రభుత్వ మెమో నెం. 536/Ser.ఏ/96, GAD, తేదీ. 09.10.1996).
- జూనియర్ అసిస్టెంట్ స్కేలుకు మించకుండా ఉన్న పోస్టు లలో లేక అంతకంటతక్కువ స్కేలులో ఉన్న పోస్టు లలో నియమించవచ్చు. కారుణ్య నియమకాలు జూనియర్ అసిస్టెంట్ పోస్టు కంటే ఎక్కువ జీతం స్కేలు కలిగి ఉన్న టీచర్, ఇంజనీరు, సివిల్ అసిస్టెంట్ సర్జను తదితర పోస్టులకు అర్హతలు కలిగి ఉన్నప్పటికనియమించరాదు (G.O.Ms.No.480,GA (Ser.A) Department, తేదీ :26.11.2002)
- కారుణ్య నియమకాలకు సంబంధించి సదరు కార్యాలములలో ఖాళీగా ఉన్న పోస్టు ల విషయము (vacancy position) క్రమము తప్పకుండా జిల్లా కలెక్టర్ (నోడల్ అధికారికి) నిర్దేశిత నమూనాలో వివరముగా పంపించవలసి ఉన్నది నిర్దేశిత నమూనాలు జతచేయడమైనది (G.O.Ms.No.215, GA (Ser.A) Department, తేదీ :08.04.1993).
- చనిపోయిన ఉద్యోగి కుటుంబ సభ్యులలో సంపాదనాపరులు ఎవ్వరూ లేనప్పుడు, భార్య / భర్త కారుణ్య నియమక అవకాశాన్ని వినియోగించుకోనప్పుడు, మైనర్లుగా ఉన్న పిల్లలు, అర్హత గల వ్యక్తులు లేనప్పుడు, కొన్ని షరతులకు లోబడి అట్టికుటుంబానికి పారితోషకము (exgratia) చెల్లించే అవకాశము ప్రభుత్వము కల్పించినది (G.O.Ms.No.114, GA (Ser.A) Department, తేదీ : 21.08.2017).
- నాల్గవ తరగతి ఉద్యోగులు - రూ. 5,00,000/
- నాన్ గెజిటెడ్ ఉద్యోగులు – రూ. 8,00,000/
- గెజిటెడ్ ఉద్యోగులు - రూ. 10,00,000/
కారుణ్య నియామకముల విషయములో పైన పేర్కొన్నవి విధివిదానాలు మాత్రమే అంతిమమైనవి గా భావించరాదు. సంబంధిత అధికారులు కారుణ్య నియామక పధకములో ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేయునప్పుడు సందర్భానుసారముగా ప్రభుత్వము మరియు సంబంధిత శాఖ వివిధ రూపములో జారీ చేయు ఉత్తర్వులను, నియమ నిబంధనలను విధిగా / నిశితముగా పరిశీలించి తదుపరి ఉత్తర్వులు జారీచేయవలసి ఉంటుంది.
Download Complete Details of Compassionate Appointments Click Here
Download G.O.Ms.No. 1005, Employment & Social Welfare Department, dated: 27.12.1974
Download Govt Cir Memo No 60681/Ser.A/2003-1 తేదీ: 12-8-2003 Click Here